August 19 2022ఆగస్ట్ 19 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 19 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం కృష్ణపక్షము 

తిథి : అష్టమి  రాత్రి 12గం౹౹59ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : కృత్తిక  శనివారం (20) తెల్లవారి 04గం౹౹45ని౹౹ వరకు తదుపరి రోహిణి 
యోగం : ధ్రువ ఈ రోజు రాత్రి 09గం౹౹00ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం : బాలవ ఉదయం 10గం౹౹05ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹08ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹30ని౹౹ నుండి 01గం౹౹20ని౹౹ వరకు
వర్జ్యం : మధ్యాహ్నం 03గం౹౹59ని౹౹ నుండి 05గం౹౹41ని౹౹ వరకు 
అమృతకాలం : రాత్రి 02గం౹౹11ని౹౹ నుండి 03గం౹౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹46ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹21ని

👉🏻🕉️శ్రీకృష్ణజన్మాష్టమి🕉️👈🏻

గురుబోధ

మంచి ఉద్యోగం కోసం కృష్ణాష్టమినాడు తులసీదళాలతో కృష్ణుడిని పూజించి, వెన్న సమర్పించాలి. ఆవుపాలతో చేసిన పాయసం నివేదిస్తే ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. ఆలయదర్శనం చేసుకోవాలి. వీలయితే 108 ప్రదక్షిణలు చేయాలి. గోపూజ చేయాలి. గోసేవకు తగిన ఆర్థిక సహాయం చేయాలి. కృష్ణునికి షోడశోపచార పూజలు చేయాలి. కృష్ణాష్టోత్తరం పారాయణము చేయాలి. తులసీదళాలతో పూజించాలి.


expand_less