August 12 2022ఆగస్ట్ 12 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 12 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం శుక్లపక్షము 

తిథి : పూర్ణిమ ఉదయం 07గం౹౹39ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : భృగువారం (శుక్రవారం) 
నక్షత్రం : ధనిష్ఠ  తెల్లవారి 04గం౹౹05ని౹౹ వరకు తదుపరి శతభిషం 
యోగం : సౌభాగ్య ఈ రోజు ఉదయం 11గం౹౹34ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం : బవ ఉదయం 07గం౹౹05ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹31ని౹౹ నుండి 01గం౹౹21ని౹౹ వరకు 
వర్జ్యం : ఉదయం 09గం౹౹09ని౹౹ నుండి 10గం౹౹40ని౹౹ వరకు 
అమృతకాలం : రాత్రి 06గం౹౹14ని౹౹ నుండి 07గం౹౹45ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹45ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹25ని


👉🏻🕉️ శ్రావణ పూర్ణిమ, రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, యజుర్వేద ఉపాకర్మ (నూతన యజ్ఞోపవీతం ధారణ), శ్రావణ శుక్రవారం 🕉️

గురుబోధ
 
ఉపాకర్మ (నూతన యజ్ఞోపవీత ధారణ)-
నిత్య కర్మానుష్ఠానము (త్రికాల సంధ్యావందనం, అగ్నికార్యం, తర్పణం) జంధ్యం ధరించిన ప్రతి వారు చేయ వలసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవి చేయలేకపోయినప్పుడు మరియు శౌచం, మైల వంటివి పాటించక వచ్చిన దోషాల ప్రాయశ్చిత్తార్థం తప్పక శ్రావణ పూర్ణిమనాడు పండితుల ఆధ్వర్యవములో నూతన యజ్ఞోపవీత ధారణ ఆచరించాలి. 
శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించక పోతే నిత్య కర్మానుష్ఠానముకు తగిన అర్హత లభించదని శాస్త్రము.


expand_less