August 11 2022ఆగస్ట్ 11 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 11 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం శుక్లపక్షము 

తిథి : చతుర్దశి ఉదయం 10గం౹౹00ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 07గం౹౹03ని౹౹ వరకు తదుపరి శ్రవణం 
యోగం : ఆయుష్మాన్ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹32ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం : వణిజ ఉదయం 10గం౹౹38ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 09గం౹౹58ని౹౹ నుండి 10గం౹౹40ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹04ని౹౹ నుండి 03గం౹౹55ని౹౹ వరకు 
వర్జ్యం : ఉదయం 10గం౹౹46ని౹౹ నుండి 12గం౹౹15ని౹౹ వరకు 
అమృతకాలం : రాత్రి 07గం౹౹42ని౹౹ నుండి 09గం౹౹11ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹45ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹26ని

గురుబోధ
పూర్వం ధర్మాత్ముడైన మిత్రసహుడు (కల్మాషపాదుడు) అనే రాజు వేటకు వెళ్లి నర్మదా నదము మరియు అక్కడ ఉన్న అమరకంటకము అనే  పర్వతవైశిష్ట్యం తెలియక వాటిని విమర్శించాడు. ఆ పాపకర్మ ఫలితంగా తరువాతి రోజులలో గురువుగారయిన వశిష్ఠుని శాపం పొంది కల్మాషపాదుడు అయ్యాడు. చివరికి రాక్షసుడై గంగాజల ప్రోక్షణ వల్ల శాపం నుండి విముక్తి పొందగలిగాడు.  ఇన్ని కష్టాలకు కారణం కేవలం మహాత్ములను, క్షేత్రాలను, నదులను, గురువులను, నిందించడం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆయా దివ్యభగవత్ స్వరూపాలను విమర్శించరాదు. చిన్నచూపు చూడరాదు. - శ్రీ నారదమహాపురాణము


expand_less