"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్ట్ 10 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం శుక్లపక్షము
తిథి : త్రయోదశి మధ్యాహ్నం 12గం౹౹27ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 08గం౹౹43ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : ప్రీతి ఈ రోజు సాయంత్రం 07గం౹౹36ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం : తైతుల మధ్యాహ్నం 02గం౹౹15ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11గం౹౹40ని౹౹ నుండి 12గం౹౹31ని౹౹ వరకు
వర్జ్యం : సాయంత్రం 04గం౹౹09ని౹౹ నుండి 05గం౹౹38ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 01గం౹౹25ని౹౹ నుండి 02గం౹౹54ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹44ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹26ని
👉🏻🕉️అంగారక(కుజ) జయంతి🕉️
గురుబోధ
శ్రావణమాస శుక్లపక్ష త్రయోదశి శ్రీ అంగారకుడు(కుజుడు) అవతరించాడు. ఉజ్జయిని(అవంతిక) క్షేత్రంలో కుజేశ్వరుడు ఉన్నాడు.
కుజుని అనుగ్రహం తో ఈ స్తోత్రం భక్తితో జపం చేస్తే రుణ
విముక్తి కలుగుతుంది. భూమికి , ఇంటికి సంబంధించిన సమస్యలు, ఆస్తి వివాదాలు తొలగుతాయి.
కుజ స్తోత్రం
శ్లో౹౹
విష్ణోర్వరాహ రూపస్య
పత్నీసా శ్రుతి సమ్మతా
తత్పుత్రో మంగళో జ్ఞేయో
ఘటేశో మంగళాత్మజ: ౹౹
- శ్రీ దేవీ భాగవతం