"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్ట్ 10 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షము తిథి : త్రయోదశి మధ్యాహ్నం 12గం౹౹27ని౹౹ వరకు తదుపరి చతుర్దశి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 08గం౹౹43ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం : ప్రీతి ఈ రోజు సాయంత్రం 07గం౹౹36ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం : తైతుల మధ్యాహ్నం 02గం౹౹15ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 11గం౹౹40ని౹౹ నుండి 12గం౹౹31ని౹౹ వరకు వర్జ్యం : సాయంత్రం 04గం౹౹09ని౹౹ నుండి 05గం౹౹38ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 01గం౹౹25ని౹౹ నుండి 02గం౹౹54ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹44ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹26ని 👉🏻🕉️అంగారక(కుజ) జయంతి🕉️ గురుబోధ శ్రావణమాస శుక్లపక్ష త్రయోదశి శ్రీ అంగారకుడు(కుజుడు) అవతరించాడు. ఉజ్జయిని(అవంతిక) క్షేత్రంలో కుజేశ్వరుడు ఉన్నాడు. కుజుని అనుగ్రహం తో ఈ స్తోత్రం భక్తితో జపం చేస్తే రుణ విముక్తి కలుగుతుంది. భూమికి , ఇంటికి సంబంధించిన సమస్యలు, ఆస్తి వివాదాలు తొలగుతాయి. కుజ స్తోత్రం శ్లో౹౹ విష్ణోర్వరాహ రూపస్య పత్నీసా శ్రుతి సమ్మతా తత్పుత్రో మంగళో జ్ఞేయో ఘటేశో మంగళాత్మజ: ౹౹ - శ్రీ దేవీ భాగవతం