August 09 2022ఆగస్ట్ 09 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 09 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం శుక్లపక్షము 

తిథి : ద్వాదశి మధ్యాహ్నం 02గం౹౹56ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : మూల ఉదయం 10గం౹౹23ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : విష్కoభ ఈ రోజు రాత్రి 11గం౹౹36ని౹౹ వరకు తదుపరి ప్రీతి 
కరణం : బవ ఉదయం 07గం౹౹25ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹23ని౹౹ నుండి 09గం౹౹08ని౹౹ వరకు;  రాత్రి 07గం౹౹19ని౹౹ నుండి 08గం౹౹48ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹57ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు 
వర్జ్యం : ఉదయం 08గం౹౹53ని౹౹ నుండి 10గం౹౹22ని౹౹ వరకు 
అమృతకాలం : తెల్లవారి 04గం౹౹15ని౹౹ నుండి 05గం౹౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹44ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹27ని

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం చేయవచ్చును.

గురుబోధ*

గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.

expand_less