"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్ట్ 02 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం శుక్లపక్షము
తిథి : పంచమి రాత్రి 02గం౹౹35ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : ఉత్తర మధ్యాహ్నం 03గం౹౹49ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం : శివ ఈ రోజు సాయంత్రం 06గం౹౹32ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం : బవ సాయంత్రం 05గం౹౹31ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹30ని౹౹ నుండి 05గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹57ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 12గం౹౹20ని౹౹ నుండి 01గం౹౹57ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 08గం౹౹21ని౹౹ నుండి 10గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹42ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹30ని
👉🏻🕉️మంగళగౌరీ వ్రతం, గరుడ పంచమి/నాగ పంచమి🕉️
గురుబోధ
శ్రావణపూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవి లోకాలని ఉద్ధరించడానికి క్షీరసాగరం నుండి అవతరించిందని పురాణకథలు చెపుతున్నాయి. అందుకే శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరమహాలక్ష్మీ వ్రతం చేస్తారు. ఏదైనా అనివార్య కారణం చేత ఆ శుక్రవారం చేయడం కుదరకపోతే తరువాత వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేసుకోవచ్చు.