కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 31 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: తదియ ఉ.8.34 కు తదుపరి చతుర్థి 1 ఉ.7.25 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: రేవతి 1 తె.4.09 కు తదుపరి అశ్విని 2 తె.3.24 కు
యోగం: గండ రా.1:50 కు తదుపరి వృద్ధి 01 రా.11:38 కు
కరణం: *విష్టి ఉ.8:51 కు, బవ రా.8:19 కు తదుపరి బాలవ ఉ 01 7:42 కు
రాహుకాలం: ఉ. 07.30 – 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.41 – 1.30 కు, మ. 3.09 – 3.58 కు
వర్జ్యం: సా.4.20 – 5.54 కు
అమృతకాలం: రా. 01.00 – 02.35 కు
సూర్యోదయం: ఉ. 6.05 కు
సూర్యాస్తమయం: సా. 6.27 కు
🕉️ సంకష్టహర చతుర్థి, చంద్రోదయం – రా. 8.30 కు 🕉️
గురుబోధ:
గణేశుని అనుగ్రహం కోసం ప్రతి మాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు.
శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రం👇
https://youtu.be/V9W-UfGJ4uY?si=KcbKrWzwx9dhesuO
🕉️👆విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది.
🕉️👆ఈ స్తోత్రం పారాయణం చేసినా లేక విన్నా కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు అయ్యి తీరుతాయి. ముఖ్యంగా చతుర్థి , సంకటహరచతుర్థి అందునా భాద్రపద మాసం లో గణేశచతుర్థి వచ్చినప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఎంతో మంచిది.
శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇
https://youtu.be/tOm3F2CXUOg?si=nninXL-i109Cj9Et
🕉️👆ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండి, పారాయణం చెయ్యండి, ఉద్యోగం వచ్చి తీరుతుంది.
🕉️👆విడిచిపెట్టకుండా ప్రతి శుక్లపక్ష చతుర్థినాడు ఈ స్తోత్రాన్ని విన్నవారికి సంపదలు లభిస్తాయి.
🕉️👆భార్యాభర్తల మధ్యలో కీచులాటలు ఎక్కువైపోతున్నప్పుడు తొమ్మిది (9) చతుర్థీ (చవితి) తిథులలో అనగా వరుసగా చవితి వచ్చినప్పుడల్లా, పారాయణం చేసినా, విన్నా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది.