కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 31 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: అష్టమి రా.11.41 కు తదుపరి నవమి 1 రా.1.23 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: అనూరాధ మ.3.39 కు తదుపరి జ్యేష్ఠ 1 సా.6.00 కు
యోగం: వైధృతి సా.3:58 కు తదుపరి విష్కంభ 1 సా.4:31 కు
కరణం: విష్టి ప.11.55 కు తదుపరి బవ రా.12.58 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:48-5:37 కు
వర్జ్యం: రా.9.48-11.32 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:13 కు
🕉️ భాద్రపద శుక్ల అష్టమి – రాధాష్టమి, దూర్వాష్టమి, శ్రీ భువనేశ్వరీదేవి జన్మతిథి (దశమహావిద్యలలో 4వ మహావిద్య) 🕉️
గురుబోధ:
శ్రీకృష్ణుడుని రాధాదేవి తన మనస్సులో లయం చేసి విజయం సాధించిన రోజు. భాద్రపద శుద్ధ అష్టమి అందుకే 'రాధాష్టమి'గా వ్యవహరిస్తారు. రాధాకృష్ణులను యథాశక్తి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే అనంతశుభఫలితాలు ప్రాప్తిస్తాయి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial