Aug 31 2023ఆగష్టు 31 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగష్టు 31 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము

తిథి : పూర్ణిమ ఉ. 08గం౹౹03ని౹౹ వరకు తదుపరి పాడ్యమిసెప్టెంబరు 1వ తేదీ తె. 05గం౹౹33ని౹౹ వరకు
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : శతభిషం రా. 08గం౹౹21ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం : సుకర్మ సా. 05గం౹౹16ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం :  బవ ఉ. 07గం౹౹05ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹56ని౹౹ నుండి 10గం౹౹46ని౹౹ వరకు & మ. 02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹42ని౹౹ నుండి 06గం౹౹12ని౹౹ వరకు & రా. 02గం౹౹19ని౹౹ నుండి 03గం౹౹48ని౹౹ వరకు
అమృతకాలం : మ. 01గం౹౹39ని౹౹ నుండి 03గం౹౹08ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹48ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹11ని౹౹కు

🕉️ గాయత్రీ ప్రతిపత్🕉️

శ్రీ గాయత్రీహృదయం 👇🏻👇🏻


శ్రీ గాయత్రీ కవచం 👇🏻👇🏻


గురుబోధ
1) గాయత్రీమంత్రోపదేశం ఉన్నవారు యథాశక్తి అష్టోత్తరశతం లేదా సహస్రం జపం చెయ్యడం చాలా శ్రేష్ఠం. 
2) శ్రీ గాయత్రీహృదయం అనే దివ్యస్తోత్రం గాయత్రీదేవి హృదయాన్ని మన వైపునకు త్రిప్పే స్తోత్రం. ఈ స్తోత్రం వలన ఏ పూట పాపం ఆ పూటే పోతుంది, ఏ రాత్రి పాపం అప్పుడే తొలగిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. తినకూడని పదార్థాలు తింటే వచ్చే పాపాలు తొలగిస్తుంది. అతి భయంకర మహాపాపాలు తక్షణం తొలగిపోతాయి.
3) శ్రీ గాయత్రీకవచం పారాయణ వలన, వేయి గోవులు దానం చెయ్యటం వల్ల వచ్చే మహాఫలితం వస్తుంది. ఏ కష్టాలూ ఉండవు. నిత్యం భక్తి, శ్రద్ధలతో చదవడం వలన సంధ్యావందనం వంటి కార్యక్రమాలు చెయ్యని మహాపాపాల నుండి కూడా విముక్తులౌతారు. తదనంతరం సంధ్యావందనాది కార్యక్రామాలు చేసుకోవచ్చు.
శ్రీ మద్దేవీభాగవతంలో శ్రీమన్నారాయణుడు నారదుడిని శిష్యుడిగా చేసుకుని మనకి అందించినవి ఈ రెండు అపూర్వ స్తోత్రాలు.
expand_less