కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 30 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: ద్వాదశి 31 తె. 3.35 కు తదుపరి త్రయోదశి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పునర్వసు రా. 8.26 కు తదుపరి పుష్యమి
యోగం: వ్యతీపాత సా. 05.47 కు తదుపరి వరీయాన్
కరణం: కౌలవ మ. 01.57 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.32 - 09.22 కు & మ. 12.42 - 01.31 కు
వర్జ్యం: తె. 4.41 - 6.02 కు & ఉ. 8.14 - 9.51 కు
అమృతకాలం: సా. 5.54 - 7.31 కు
సూర్యోదయం: ఉ. 6.02 కు
సూర్యాస్తమయం: సా. 6.31 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు చేయాలి.
గురుబోధ:
ఏకాదశి మర్నాడు ద్వాదశినాడు ఉదయాన్నే లేచి తిరిగి విష్ణువుని అర్చించి ద్వాదశి ఘడియలు గడవక ముందే పారణం పూర్తి చేయాలి, శక్తికొలది దానాలు చేయడం మంచిది.
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ కృష్ణాలయం(నాగోల్ - ళ్భ్ నగర్), భాగ్యనగరంలో సంపూర్ణ పద్మమహా పురాణము 54 రోజుల ప్రవచనంలో మొదటి విడత 7రోజులలో 7వ రోజు శనివారం శ్రీనివాస కల్యాణం ఉదయం 8 గం.లకు ఉంటుంది.