" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 30 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము
తిథి : చతుర్దశి ఉ. 10గం౹౹32ని౹౹ వరకు తదుపరి పూర్ణిమవారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : ధనిష్ఠ రా. 10గం౹౹0ని౹౹ వరకు తదుపరి శతభిషంయోగం : అతిగండ రా. 09గం౹౹33ని౹౹ వరకు తదుపరి సుకర్మకరణం : వణిజ ఉ. 10గం౹౹58ని౹౹ వరకు తదుపరి విష్టిరాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹37ని౹౹ నుండి 12గం౹౹26ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹43ని౹౹ నుండి 05గం౹౹48ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹22ని౹౹ నుండి 01గం౹౹51ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹48ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹13ని౹౹కు
🕉️ హయగ్రీవ జయంతి, రాఖీ పండుగ, విఖనస మహర్షి జయంతి, యజుర్వేద ఉపాకర్మ, జంధ్యాల పూర్ణిమ🕉️
గురుబోధ
శ్రావణపూర్ణిమ (జంధ్యాల పూర్ణిమ) నాడు జంధ్యం ధరించే ఆచారం ఉన్నవారు తప్పక పురోహితుని లేదా ఆచార్యుని సన్నిధిలో శాస్త్రోక్తంగా నూతనయజ్ఞోపవీతం ధరించాలని శాస్త్రం . ఏడాది మొత్తం మైల, అశౌచం సమయంలో తెలిసీ తెలియక చేసిన పాపములను మరియు సంధ్యావందనం సరైన సమయంలో చేయకపోవడం వల్ల వచ్చే పాపములను ప్రాయశ్చిత్తం ద్వారా తొలగించుకోవచ్చు.