Aug 29 2025ఆగష్టు 29 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 29 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: షష్ఠి రా.7.42 కు తదుపరి సప్తమి 30 రా.9.46 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: స్వాతి ఉ.10.29 కు తదుపరి విశాఖ 30 మ.1.07 కు
యోగం: బ్రహ్మ మ.2:12 కు తదుపరి ఐంద్ర 30 మ.3:09 కు
కరణం: కౌలవ ఉ.7.09 కు తదుపరి తైతుల రా.8.22 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:34-9:23 కు, మ.12:41-1:31 కు
వర్జ్యం: సా.4.41-6.27 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:17 కు

🕉️ భాద్రపద శుద్ధ షష్ఠి - సూర్య షష్ఠి 🕉️

గురుబోధ:
సప్తమి కలిసిన షష్ఠి సూర్య భగవానుడికి ప్రీతికరం. ఈ రోజు సూర్యుడుని ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో ప్రసన్నం చేసుకుంటే అశ్వమేధయాగం చేసిన ఫలితం కన్నా ఎక్కువ ఫలితం పొందుతాము. షష్ఠితో కూడిన సప్తమి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన కూడా విశేషఫలితం ప్రసాదిస్తుందని పెద్దలు చెప్తారు.

expand_less