కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 28 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: పంచమి సా.5.42 కు తదుపరి షష్ఠి 29 రా.7.42 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: చిత్త ఉ.7.59 కు తదుపరి స్వాతి 29 ఉ.10.29 కు
యోగం: శుక్ల మ.1:17 కు తదుపరి బ్రహ్మ మ.2:12 కు
కరణం: బాలవ సా.5.57 కు తదుపరి కౌలవ 29 ఉ.7.09 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:13-11:02 కు, మ. 3:10-4:00 కు
వర్జ్యం: మ.2.10-3.56 కు
అమృతకాలం: రా.1:46-3:34 కు
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:17 కు
🕉️ భాద్రపద శుద్ధ పంచమి, ఋషిపంచమి 🕉️
గురుబోధ:
మానవులై పుట్టాక ఋషుల ఋణం, దేవతల ఋణం, పితృదేవతల ఋణం ఈ ఋణాలన్నీ తీర్చుకోవాలి. అందులో ఋషుల యొక్క ఋణం తప్పక తీర్చుకోవాలి. ఈ రోజున మనం వీలున్నంతవరకు ఋషులు యొక్క పేర్లు తలుచుకోవాలి. పంచమినాడు ప్రొద్దుటే లేచి తలారా స్నానం చేసి కాసేపు విఘ్నేశ్వర ధ్యానం చేసాక సప్తఋషులను కౌండిన్యుడు, అత్రి, మరీచి మొదలైనటువంటి ఋషులను ముఖ్యంగా వ్యాసుడిని తప్పక తలచుకోవాలి. ఋషుల పేర్లు చెప్పి ఈ ఋషులు రాసినటువంటి పుస్తకాలు లోకంలో ప్రచారం చేస్తున్న మహానుభావులైనటువంటి గురువులందరినీ తలచుకోవాలి. గురుపూజ చేయటం మంచిది. ఋషులవలె జీవితం సాగిస్తున్నటువంటి పౌరాణికులను ఈ రోజు పూజిస్తే సకల దేవతలు అనుగ్రహిస్తారు. ఋషిఋణం తీరుతుంది. ఋషిపంచమి నాడు సాయంత్రం వేళ శివాలయములో ప్రదక్షిణ చేసి శివుడిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అందునా ప్రదోషకాలంలో శివదర్శనం చాలా మంచిది.