కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 27 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్దశి ఉ.8.27 కు తదుపరి పూర్ణిమ 28 ఉ.9.14 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ధనిష్ఠ రా.2.49 కు తదుపరి శతభిషం 29 తె.3.52 28
యోగం: అతిగండ ఉ.7:27 కు తదుపరి సుకర్మ 28 ఉ.6:35 కు
కరణం: వణిజ ఉ.9.09 కు, విష్టి రా.9:32 కు తదుపరి బవ 28 ఉ.9:48 కు
రాహుకాలం: మ. 01.30 – 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.13 – 11.03 కు, మ. 3.11 – 4.01 కు
వర్జ్యం: తె.5.30 -7.12 కు
అమృతకాలం: మ. 03.12 – 04.54 కు
సూర్యోదయం: ఉ. 6.05 కు
సూర్యాస్తమయం: సా. 6.30 కు
గురుబోధ:
ఏ దేవాలయానికైనా దానం చేసినవారు ఆ ఆలయ నిర్మాణానికి ఎన్ని ఇసుక రేణువులు ఉపయోగించబడ్డాయో అన్ని దివ్యసంవత్సరములు సాక్షాత్ శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్యసన్నిధానమైన వైకుంఠంలో ఉంటారు. ఆలయనిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి దానం చేయలేకపోయినా, తన ఇంట్లో నుండే ఈ దానం చేసినవారు చతుర్గుణం, అనగా నాలుగురెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు.