కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 27 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్థి మ.3:57 కు తదుపరి పంచమి 28 సా.5.42 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: చిత్త 28 ఉ.8:01 కు తదుపరి స్వాతి 29 ఉ.10.32 కు
యోగం: శుభ మ.12:34 కు తదుపరి శుక్ల 28 మ.1:17 కు
కరణం: విష్టి మ.3.44 కు తదుపరి బవ తె.4.48 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:52-12:42 కు
వర్జ్యం: మ.2.27-4.11 కు
అమృతకాలం: రా.1:37-3:23 కు
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:17 కు
🕉️ వినాయక చతుర్థి (గణపతి నవరాత్రులు ప్రారంభం) శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జయంతి (దత్తాత్రేయ స్వామి అవతారం) 🕉️
గురుబోధ:
గణేశచతుర్థి నాడు చేయవలసిన కొన్ని ముఖ్యమైనవి:
1) ఈ తిథి నాడు ఉదయమే లేచి తలారా స్నానము చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసి ఆ తరువాత మట్టితోటి విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను చేయండి. మట్టి ప్రతిమను పూజించాలి అని పదేపదే మన పురాణాలు చెపుతున్నాయి.
2) అందులోకి విఘ్నేశ్వరుడిని ఆవాహన చేయాలి. పెద్ద పెద్ద విగ్రహాలు ఎన్ని పెట్టినా తప్పనిసరిగా చిన్న ప్రతిమ ఉండాలి. నిమజ్జనం చేసేటప్పుడు ఎన్ని రకాల ప్రతిమలు ఉన్నప్పటికీ మట్టి బొమ్మ లేకపోతే ఆ నిమజ్జనం వ్యర్థమైపోతుంది.
3) విఘ్నేశ్వరుడు మోదకప్రియుడు. మోదకము అంటే లడ్డు. ఉత్తర్ భారత్ వాళ్ళు తీపి లడ్డూలు తయారు చేస్తారు. ఆవిరితో తయారు అయినటువంటి బియ్యపురవ్వతో తయారు చేసిన కుడుములను కూడా మోదకములు అంటారు. మన తెలుగు వాళ్ళు కుడుములు పెడతారు. రెండూ శాస్త్రమే. కుడుములు నివేదన చేసి ప్రసాదంగా తినాలి.
3) కథాక్షతలు వేసుకోవాలి. కథ వింటున్నప్పుడు చేతిలో అక్షతలు ఉంచుకోవాలి. కథ అయ్యాక స్వామివారి అక్షతలు వద్ద వేసి, అవి తీసుకుని నెత్తి మీద వేసుకోవాలి. అలా అక్షతలు వేసుకోకుండా చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయి.
5) విఘ్నేశ్వరుడి పూజలో ప్రత్యేకత ఏమిటంటే మనకి మనమే మొట్టికాయలు వేసుకుంటే మహాపాపాలు అన్నీ తొలగిపోతాయి. ఆయనకి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన మహాఫలితం వస్తుంది.
6) ఒక పుస్తకం కానీ, పలక కానీ దాని మీద 'ఓం' కారం రాసి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి ఆ పుస్తకాలు వాడుకుంటే చదువు బాగా పెరుగుతుంది. విఘ్నేశ్వరుడి గురించి "భక్తి ప్రియో గణేశః" అని శివపురాణం చెపుతున్నది. భక్తి అంటే ఆయనకి చాలా ఇష్టం. అత్యంత భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని పూజించి కథాక్షతలు శిరస్సున వేసుకుంటే ఆ సంవత్సరమంతా విఘ్నాల నుంచి బయటపడతాము.
పూజ్య గురువులు అందించిన శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రం👇
https://youtu.be/EtyvpKuZCBk?si=D6zKml4VEw_-deOf
PDF - https://srivaddipartipadmakar.org/stotram/sri-ganesa-sahasranama-stotram/