Aug 27 2023ఆగస్టు 27 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 27 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము

తిథి : ఏకాదశి సా. 05గం౹౹17ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : పూర్వాషాఢ రా. 02గం౹౹43ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : ప్రీతి మ. 01గం౹౹27ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం :  వణిజ ఉ. 10గం౹౹55ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹38ని౹౹ నుండి 05గం౹౹28ని౹౹ వరకు
వర్జ్యం : మ. 01గం౹౹01ని౹౹ నుండి 02గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం : రా. 10గం౹౹09ని౹౹ నుండి 11గం౹౹40ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹48ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹15ని౹౹కు

🕉️ఏకాదశి🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు ఉదయం చేయాలి.

https://www.youtube.com/watch?v=DpjBm71jA_s&t=309s&pp=ygUVdmFzdWRldmEgc2F0YW5hbWF2YWxp

గురుబోధ
తీర్థయాత్రలు చేయడం కుదరనప్పుడు తీర్థయాత్రలు చేసేవారికి ధన, వస్తు రూపములో ఎంతో కొంత సహాయం చేసినవారికి కూడా ఆ తీర్థయాత్రలు చేసిన ఫలితం కొంత వస్తుంది. ఎన్నో వేలజన్మల సంస్కారం, పుణ్యం ఉంటే గాని తీర్థయాత్రలు చేయలేము. పైగా సద్గురువులతో యాత్ర చేసే భాగ్యం మరింత అదృష్టం. అటువంటి పుణ్య ప్రదేశాలలో ఇతరుల పై చాడీలు చెప్పడం, కోపగించుకోవడం, ఏదో ఒక వంక పెట్టి అసంతృప్తి వ్యక్తపరచడం, విరుచుకుపడడం చేయరాదు. సాధ్యమైనంత వరకు ఏదో ఒక నామ జప, పారాయణం, పురాణశ్రవణంతో కాలం గడుపుతూ భగవద్దర్శనం చేసుకుంటుండాలి.

expand_less