కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 26 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: తదియ మ.2.42 కు తదుపరి వినాయక చతుర్థి 27 మ.357 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: హస్త 27 తె.5.50 కు తదుపరి చిత్త 28 ఉ.8:01 కు
యోగం: సాధ్య రా.12:08 కు తదుపరి శుభ 27 రా.12:34 కు
కరణం: గరజి మ.12.35 కు తదుపరి వణిజ రా.2.46 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:34-9:23 కు, మ. 11:08-11:54 కు
వర్జ్యం: మ.12.51-2.33 కు
అమృతకాలం: రా.11:30-1:15 కు
సూర్యోదయం: ఉ. 5:47 కు
సూర్యాస్తమయం: సా. 6:20 కు
🕉️ శ్రీ వరాహ స్వామి జయంతి🕉️
గురుబోధ:
"భాద్రపద శుక్ల తృతీయ" ఇది వరాహ జయంతి, ఈరోజు వరాహస్వామి వారిని తలుచుకోవాలి. ఆయన్ని తెల్లని పూలతో పూజ చేసినా, భూదానం చేసినా, వెండి దానం చేసినా సకల శుభాలు కలుగుతాయి.