Aug 26 2023ఆగస్టు 26 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 26 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము

తిథి : దశమి రా. 07గం౹౹04ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : స్థిరవాసరం (శనివారం)
నక్షత్రం : మూల 27వ తేదీ తె. 03గం౹౹53ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : విష్కంభ సా. 04గం౹౹27ని౹౹ వరకు తదుపరి ప్రీతి
కరణం :  తైతుల మ. 01గం౹౹10ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹48ని౹౹ నుండి 07గం౹౹28ని౹౹ వరకు
వర్జ్యం : మ. 12గం౹౹26ని౹౹ నుండి 01గం౹౹58ని౹౹ వరకు & రా. 02గం౹౹20ని౹౹ నుండి 03గం౹౹52ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹42ని౹౹ నుండి 11గం౹౹14ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹48ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹16ని౹౹కు


గురుబోధ
శరీరం మీద ప్రేమతో, నిరంతరం భ్రాంతితో జీవులు నానా బాధలు పడుతున్నారు. ఈ బంధాల నుండి బయటపడడానికి అప్పుడప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళాలి. కాని గురుభక్తి లేని తీర్థం వ్యర్థం. గురువుగారి శక్తి ఉంటేనే అది తీర్థం అవుతుంది. గంగలో స్నానం చేసాం, గురువుగారు ఉంటేనే ఆ తీర్థం అనంతమైన శక్తినిస్తుంది. గురువుగారు లేకపోతే సంపూర్ణ శక్తినివ్వదు. గురుభక్తి లేకుండా దేవతా పూజ చేయడం, తీర్థయాత్ర చేయడం పుష్కరస్నానం చేయడం, గురువుగారి అనుగ్రహం లేకుండా గ్రహణస్నానాదులు చేయడం వ్యర్థం.

expand_less