" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్టు 25 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము తిథి : నవమి రా. 08గం౹౹29ని౹౹ వరకు తదుపరి దశమి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : జ్యేష్ఠ 26వ తేదీ తె. 04గం౹౹43ని౹౹ వరకు తదుపరి మూల యోగం : వైధృతి సా. 06గం౹౹51ని౹౹ వరకు తదుపరి విష్కంభ కరణం : బాలవ మ. 02గం౹౹42ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & మ. 12గం౹౹28ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 10గం౹౹42ని౹౹ నుండి 12గం౹౹16ని౹౹ వరకు అమృతకాలం : రా. 08గం౹౹06ని౹౹ నుండి 09గం౹౹40ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹48ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹17ని౹౹కు 🕉️వరలక్ష్మీవ్రతం🕉️ గురుబోధ వరలక్ష్మీవ్రతం రోజున చేయవలసిన విధివిధానాలలో కొన్ని: సాయంత్రంవేళ లక్ష్మీదేవి గుడిలో ప్రదక్షిణలు చేయాలి. లక్ష్మీనారాయణులు గురుదంపతుల రూపంలో ఉంటారు. గురుదంపతులను పూజించి ప్రదక్షిణ చేయాలి. కుదరని వారు కనీసం గురువుల పటం పెట్టుకుని పూజించాలి. అమ్మవారిని పసుపు కొమ్ములతో అర్చించాలి. శ్రీ సూక్తం పారాయణ తప్పకుండా చేయాలి, లేదా వినాలి. అమ్మవారిని అష్టోత్తరశతనామాలతో , బిల్వపత్రాలతో పూజించాలి. ఇలా చేయడం వలన సంపదలకు లోటు ఉండదు. శక్తిని అనుసరించి సువర్ణ, రజత దానాలు చేయాలి. అన్నదానం చేయాలి. కప్పుకోవటానికి పనికివచ్చే దుప్పటి కానీ, శాలువా కానీ మహానుభావులైన గురువులకు దానం చేస్తే, భార్యాభర్తలు ఎప్పుడుా ఐకమత్యంతో జీవిస్తారు. ఈ వ్రతమును పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆచరించకపోతే, చివరి శుక్రవారం చేసుకోవచ్చు. సంపదలు అనగా ఒక్క ధనము మాత్రమే కాదు; సంతానం, ఆరోగ్యం, విద్య తదితరులు కూడా. https://www.youtube.com/watch?v=if5zzw20GaQ&t=14s&pp=ygUkdmFkZGlwYXJ0aSBwYWRtYWthciBsYWtzaG1raSBzdG90cmFt