" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్టు 24 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము తిథి : అష్టమి రా. 09గం౹౹37ని౹౹ వరకు తదుపరి నవమి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : అనూరాధ 25వ తేదీ తె. 05గం౹౹14ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ యోగం : ఐంద్ర రా. 08గం౹౹37ని౹౹ వరకు తదుపరి వైధృతి కరణం : విష్టి మ. 03గం౹౹26ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹58ని౹౹ నుండి 10గం౹౹48ని౹౹ వరకు & మ. 02గం౹౹59ని౹౹ నుండి 03గం౹౹49ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 09గం౹౹13ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు అమృతకాలం : రా. 06గం౹౹49ని౹౹ నుండి 08గం౹౹25ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹47ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹18ని౹౹కు గురుబోధ పురాణములు వినడమే కాదు, భక్తులకు వినిపించడం, వినేట్లు చేయడం గొప్ప భాగవత సేవ! ఇలా ఇతరులకు వినిపించి వారిని బాగుచేయాలనే తపన కలిగిన వారిని చూసి భగవంతుడు సంతోషిస్తాడు. పురాణ శ్రవణము, యాత్రా ఫలితం, మనం చేసే దాన ధర్మములు మనలని, మన పిల్లలని, మన వంశాన్ని కూడా తరింపచేస్తాయి.