Aug 23 2026ఆగష్టు 23 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 23 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: ఏకాదశి 24 తె.3.36 కు తదుపరి ద్వాదశి 25 తె.5.30 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: మూల సా.6.25 కు తదుపరి పూర్వాషాఢ 24 రా.8.57 కు
యోగం: ప్రీతి ఉ.7:03 కు తదుపరి ఆయుష్మాన్ 24 ఉ.7:40 కు
కరణం: వణిజ మ.3:11 కు తదుపరి విష్టి 24 తె.4.19 కు
రాహుకాలం: సా. 04.30 – 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.53 – 5.43 కు
వర్జ్యం: సా.4.38 – 6.25 కు
అమృతకాలం: ఉ. 10.38 – 12.25 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.33 కు

ఏకాదశీ ఉపవాసం ఆదివారం ఉండాలి, ద్వాదశీ పారణ సోమవారం చేయాలి.

🕉️ శ్రావణశుక్ల ఏకాదశి, పుత్రద ఏకాదశి, అరవిందయోగి జయంతి 🕉️

గురుబోధ:
శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. కలియుగంలో పుత్రులు కావాలనుకున్నవారు ఆచరించవలసినటువంటి ఏకాదశి ఈ పుత్రదా ఏకాదశి .
ఈ రోజు పాటించవలసిన విధివిధానాలు👇
🕉️ వీలున్నంత వరకు ఈరోజు నారాయణ స్మరణ చేయాలి. అష్టాక్షరీ మంత్రోపదేశం ఉన్నవాళ్లు ఆ మంత్రాన్ని జపించాలి. వీలుంటే విష్ణు సంకీర్తన చేయాలి.
🕉️ కలియుగంలో వివిధ కారణాల వలన పూర్తిగా ఉపవాసం ఉండలేము కనుక ఒక పండు, పాలు లేదా స్వల్ప ఆహారం తీసుకుని ఉపవాసం ఉండాలి. అన్నం మాత్రం తినకూడదు.
🕉️ఈ వ్రతం చేసి మర్నాడు ద్వాదశినాడు ఉదయాన్నే లేచి తిరిగి విఘ్ణవుని అర్చించి ద్వాదశి ఘడియలు దాటక ముందే పారణ పూర్తి చేయాలి. శక్తి కొలది దానాలు చేయడం మంచిది.
🕉️ ఏకాదశి నాడు గోవులకు ప్రదక్షిణ చేసి గోవులకు గడ్డి పెట్టాలి, గోపూజ చేయాలి.

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less