కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 23 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్థి మ. 3.29 కు తదుపరి పంచమి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: రేవతి రా. 1.36 కు తదుపరి అశ్విని
యోగం: శూల ఉ. 08.31 కు తదుపరి గండ
కరణం: బాలవ ఉ. 10.38 కు తదుపరి కౌలవ
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.32 - 09.22 కు & మ. 12.44 - 01.34 కు
వర్జ్యం: మ. 2.26 - 3.55 కు
అమృతకాలం: రా. 11.29 - 12.49 కు
సూర్యోదయం: ఉ. 6.01 కు
సూర్యాస్తమయం: సా. 6.36 కు
👉🕉️ శ్రావణ శుక్రవారం🕉️ 👈
గురుబోధ:
నామధేయాని కుర్వన్తి స్థానాని చ నరా భువి |
దుర్గేతి భద్రకాళీతి విజయా వైష్ణవీతి చ || (వ్యా.భా. స్కం 10 అ 2 శ్లో11)
కుముదా చణ్డికా కృష్ణా మాధవీ కన్యకేతిచ |
మాయా నారాయణీశానీ శారదేత్యమ్బికేతి చ|| (వ్యా.భా. స్కం 10 అ 2 శ్లో 12)
నిన్ను - 1. దుర్గ 2. భద్రకాళి 3. విజయ 4.వైష్ణవి 5.కుముదా 6.చండిక 7.కృష్ణ 8.మాధవి 9.కన్యక 10.మాయ 11.నారాయణి 12.ఈశాని 13.శారద 14. అంబికా - అనే 14 నామాలతో నేను స్తుతిస్తున్నాను. ఈ 14 నామాలతో భూమండలంలో నిన్ను పూజిస్తారు. నీకై యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తారు. కలియుగాంతం వరకు నిన్ను పూజించిన వారిని అనుగ్రహిస్తూ ఉండు అని శ్రీమహావిష్ణువు యోగమాయతో అన్నాడు. కన్యకయే వాసవీ కన్యకాపరమేశ్వరి. శారదా నామము కృష్ణుడు ఇచ్చినదే. శంకరాచార్యులు పురాణాలు బాగా ఎఱిగిన వారు కావున శారదా పీఠాలను స్థాపించారు. శారదయే శారదా పరమేశ్వరి. ద్వారకా నగర స్థాపన అయ్యాక కృష్ణుడే స్వయముగా అష్టభుజి అయిన అంబికాలయమును కట్టాడు. కృష్ణావతార సమాప్తి కాగానే ఆ ఆలయము సముద్రంలో కలసిపోయింది.