Aug 23 2023ఆగస్టు 23 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 23 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము

తిథి : సప్తమి రా. 10గం౹౹08ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : విశాఖ 24వ తేదీ తె. 05గం౹౹13ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : బ్రహ్మ రా. 09గం౹౹45ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం :  గరజి మ. 03గం౹౹23ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹38ని౹౹ నుండి 12గం౹౹29ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 10గం౹౹27ని౹౹ నుండి 12గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹21ని౹౹ నుండి 10గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹47ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹18ని౹౹కు


గురుబోధ
సత్త్వగుణం వలన ప్రాణులపై ప్రీతి ఏర్పడుతుంది. దీనినే భూతదయ అంటాం. ఋజువర్తన, సత్యం, శౌచం, శ్రద్ధ, క్షమ, ధృతి, ప్రేమ, కరుణ, లజ్జ, శాంతి, సంతోషం, ఇవన్నీ సత్త్వ గుణ లక్షణాలు. సత్త్వ గుణం తెల్లని రంగుతో దర్శనమిస్తుంది, సత్త్వగుణం వల్ల ధర్మం మీద ప్రీతి పెరుగుతుంది. సత్త్వగుణం సత్పదార్థం మీద శ్రద్ధను పుట్టిస్తుంది, అశ్రద్ధను నివారిస్తుంది.

expand_less