కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 22 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: దశమి రా.1.34 కు తదుపరి ఏకాదశి 24 తె.3.36 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: జ్యేష్ఠ మ.3.48 కు తదుపరి మూల 23 సా.6.25 కు
యోగం: విష్కంభ 23 ఉ.6:13 కు తదుపరి ప్రీతి 24 ఉ.7:03 కు
కరణం: తైతుల మ.12:48 కు తదుపరి గరిజ రా.2:00 కు
రాహుకాలం: ఉ. 09.00 – 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.44 – 8.34 కు
వర్జ్యం: రా.12.40 – 2.27 కు
అమృతకాలం: తె. 04.55 – 06.43 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.33 కు
గురుబోధ:
వ్యాసానుగ్రహం లేనిదే అష్టాదశ పురాణములు సంపూర్ణంగా శ్రవణం చేసే భాగ్యం అందరికీ కలగదు. పురాణములు పండితులకు, భక్తులకు దానం ఇవ్వడము, పిల్లల చేత ఇప్పించడం ఎంతో పుణ్యము. అక్షరాభ్యాసం నాడు తప్పక పిల్లలచేత పురాణములు, మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు ఇప్పించాలి. పురాణములు వినడమే కాదు, భక్తులకు వినిపించడం, వినేట్లు చేయడం గొప్ప భాగవత సేవ! ఇలా ఇతరులకు వినిపించి వారిని బాగుచేయాలనే తపన కలిగిన వారిని చూసి భగవంతుడు సంతోషిస్తాడు.