కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 22 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్దశి మ.1.41 కు తదుపరి శ్రావణ అమావాస్య 23 మ.1.07 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఆశ్లేష రా.1.05 కు తదుపరి మఖ 23 రా.1.30 కు
యోగం: వరీయాన్ సా.2:35 కు తదుపరి పరిఘ 23 సా.1:19 కు
కరణం: శకుని మ.11.57 కు తదుపరి చతుష్పాద రా.11.42 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8:34-9:24 కు, మ. 12:44-1:33 కు
వర్జ్యం: మ.1.56-3.30 కు
అమృతకాలం: రా.10:40-12:16 కు
సూర్యోదయం: ఉ. 5:47 కు
సూర్యాస్తమయం: సా. 6:20 కు
🕉️ రుద్రసావర్ణి మన్వాది, శ్రావణ శుక్రవారం 🕉️
గురుబోధ:
శ్రావణమాసం లక్ష్మీదేవికి, గౌరీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసము. ఈ సంవత్సరంలో శ్రావణమాసంలో ఆఖరు శుక్రవారం. శ్రావణ మాసం ఎంతో విశేషమైన మాసము. ఈ మాసంలో మంగళగౌరీ పూజలు, లక్ష్మీదేవి పూజలను విశేషంగా చేస్తారు. శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవి లోకాలని ఉద్ధరించడానికి క్షీరసాగరం నుండి అవతరించిందని పురాణకథలు చెపుతున్నాయి. అందుకే శ్రావణపూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఏదైనా అనివార్యకారణం చేత ఆ శుక్రవారం చేయడం కుదరకపోతే తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో ఈ వ్రతం చేసుకోవచ్చు.
https://youtu.be/yUXkM_QhZgA?si=CUgg8nsvHVD3TnWT