కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 22 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: తదియ సా. 5.57 కు తదుపరి చతుర్థి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర 23 తె. 3.16 కు తదుపరి రేవతి
యోగం: ధృతి మ. 01.11 కు తదుపరి శూల
కరణం: విష్టి మ. 01.46 కు తదుపరి బవ
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.13 - 11.03 కు & మ. 03.15 - 04.06 కు
వర్జ్యం: మ. 1.52 - 3.21 కు
అమృతకాలం: రా. 10.57 - 12.20 కు
సూర్యోదయం: ఉ. 6.01 కు
సూర్యాస్తమయం: సా. 6.37 కు
గురుబోధ:
ఎప్పుడైతే భ్రమ తొలగి, భగవంతుడు సర్వాంతర్యామి అన్న భావన కలుగుతుందో తన్మయత్వం పొందుతామో, భగవంతుడు సర్వాంతర్యామియైనా అంతర్యామి అని గ్రహిస్తామో అప్పుడు తన్మయత్వములో, తాదాత్మ్యము చెంది కన్నులు మూసుకుంటాము. ఇది మనలో అంతర్లీనంగా ఉండే ఉపాసనాశక్తి వల్ల జరుగుతుంది. ఆ స్థితిలో భగవంతుడి అనుగ్రహం కలిగి, శీఘ్రముగా దర్శనం కలుగుతుంది. కనుకనే జ్ఞానులు సమాధిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ తన్మయత్వములో కన్నులు మూసుకుంటారు. ఉదా: హాథీరాం బాబాజీ (భగవంతుడు ఏనుగురూపం లో వచ్చి చెరకుగడలు తిని అతడిని రక్షించడం వలన అప్పటినుంచి ఆయనని హాథీరాంబాబాజీ అని పిలుస్తున్నారు) కృష్ణుడు ఎదురుగా దర్శనమిచ్చినప్పుడు అన్నీ మర్చిపోయి తన్మయత్వం తో కన్నులు మూసేసేవాడు. అప్పుడు కృష్ణుడు నన్ను చూడడానికి పిలిచి, నేను వచ్చినప్పుడు కన్నులు మూసుకుని ఉంటావేమిటి? అని అడిగేవాడు. ఏమి చెప్పమంటావు కృష్ణా! కన్నులు తెరిచి చూచినట్లైతే నీ చిన్నరూపమే కనిపిస్తుంది. కానీ కన్నులు మూసి చూచినప్పుడు కోటిసూర్యులకాంతితో దివ్యమంగళరూపముతో మనోదర్శనమిస్తావు. అందుకే కళ్ళు మూసుకున్నాను, కానీ నా ఎదురుగా నువ్వు లేకపోయినట్లైతే అంతటి గొప్ప దర్శనము కలుగదు, కాబట్టి నా ఎదురుగా ఉండమని ప్రార్థించేవాడు.