Aug 22 2023ఆగస్టు 22 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 22 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము

తిథి : షష్ఠి రా. 10గం౹౹16ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : స్వాతి 23వ తేదీ తె. 04గం౹౹45ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం : శుక్ల రా. 10గం౹౹18ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం :  కౌలవ మ. 02గం౹౹37ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹21ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & రా. 10గం౹౹54ని౹౹ నుండి 11గం౹౹39ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 09గం౹౹34ని౹౹ నుండి 11గం౹౹14ని౹౹ వరకు
అమృతకాలం : రా. 06గం౹౹34ని౹౹ నుండి 08గం౹౹14ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹47ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹19ని౹౹కు

https://www.youtube.com/watch?v=FNh6oGn-k8w&pp=ygUjbGFrc2htaSBzdG90cmFtIHZhZGRpcGFydGkgcGFkbWFrYXI%3D

🕉️శ్రావణ మంగళవారం🕉️

గురుబోధ
గౌరీదేవి ప్రతి శ్రావణ మాసంలో మంగళవారం నాడు భూలోకసంచారం చేసి భూలోకంలో ఉన్న స్త్రీలను అనుగ్రహిస్తాను అని అన్నది. భూలోకంలో అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర ద్వారా మంగళగౌరీ వ్రతాన్ని వ్యాపింప చేసింది. ఈ వ్రతం చేసిన  వారింట్లో గౌరీదేవి కొలువై ఉంటుంది. స్త్రీలకు శాశ్వతముగా ముత్తైదువగా ఉండే వరాన్నిస్తుంది. 

expand_less