Aug 21 2025ఆగష్టు 21 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 21 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం

తిథి: త్రయోదశి మ.2.35 కు తదుపరి చతుర్దశి 22 మ.1.41 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పుష్యమి రా.1.09 కు తదుపరి ఆశ్లేష 22 రా.1.05 కు
యోగం: వ్యతీపాత సా.4:13 కు తదుపరి వరీయాన్ 22 సా.2:35 కు
కరణం: వణిజ మ.12.45 కు తదుపరి విష్టి రా.12.17 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:14-11:04 కు, మ. 3:14-4:04 కు
వర్జ్యం: ఉ.9.28-11.01 కు
అమృతకాలం: సా.05:49-07:24 కు
సూర్యోదయం: ఉ. 5:47 కు
సూర్యాస్తమయం: సా. 6:20 కు

🕉️ మాస శివరాత్రి, విశేష శుభ ఫలితాలు ప్రసాదించే గురు పుష్యయోగం, శ్రావణ కృష్ణ పక్ష త్రయోదశి కలియుగం ప్రారంభం 🕉️

ఈ రోజు చేసే దానాలు అధిక ఫలాన్ని ఇస్తాయి. ఈ రోజు చేసే దానం అక్షయమవుతుంది, అత్యంత పుణ్యప్రదం. ఎంతోకొంత తమ శక్తిని బట్టి దానం చేస్తే జీవితంలో ఏ లోటూ రాదు.
గురువారం రోజున పుష్యమీ నక్షత్రం వస్తే ఆ రోజున ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభిస్తే చాలా మంచి శుభ ఫలితాలను లభిస్తాయి.

గురుబోధ:
తనకు తోచినప్పుడల్లా అనేక పార్ధివలింగాలని తయారుచేసుకుని, వీలున్నప్పుడల్లా అర్చన చేసేవాడు, అందులో ముఖ్యంగా సోమవారం కానీ, చతుర్దశి నాడు కానీ, మాసశివరాత్రి నాడు కానీ, అష్టమినాడు కానీ, శివరాత్రి నాడు కానీ ఇటువంటి పర్వదినాలలో లెక్కపెట్టకుండా తోచినన్ని పార్ధివలింగాలని చేసి పూజించువాడు ముక్తి పొంది తీరుతాడు. నాకు భూమి కావాలి, కాస్త స్థలమో, పొలమో కావాలి అనుకున్నవాడు వెయ్యి పార్ధివలింగాలని భక్తితో పూజించినవాడు, అభిషేకించినవాడు తప్పక భూమిని పొందుతాడు. శివానుగ్రహం ఒకటే కావాలనుకున్న వాడు, పరమేశ్వరుని యెుక్క కరుణ కావాలనుకున్న వాడు, 3000 పార్ధివలింగాలని అభిషేకం చేసుకోవాలి. అభిషేకాలు, అర్చనలు ఇంట్లో కంటే గుడిలో, గుడిలో కంటే తీర్ధ స్థలాలలో, నదీ తీరాలలో ఇంకొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అదే గంగానదీ తీరంలో చేసుకుంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. కాశీ వంటి దివ్య క్షేత్రాలలో గంగాతీరంలో చేసుకుంటే అనంత ఫలితం ఇస్తుంది. ఇలా వారి వారి శక్తిని బట్టి చేసుకోమన్నారు. ఆర్ధికంగా చితికిపోయిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం. శివుడు అవ్యాజకరుణామూర్తి. ఒకవేళ మన దగ్గర ధనం లేదు, అభిషేకము చేయడానికి పంచామృతాలు లేవు, అప్పుడు ఇన్ని నీళ్లు జల్లినా సంతోషిస్తాడు. - శ్రీ శివమహాపురాణం.

expand_less