కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 21 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ రా. 8.21 కు తదుపరి తదియ
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: శతభిషం ఉ. 6.31 కు తదుపరి పూర్వాభాద్ర 22 తె. 4.56 కు
యోగం: సుకర్మ సా. 05.01 కు తదుపరి ధృతి
కరణం: తైతుల తె. 06.49 కు తదుపరి గరజి
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.54 - 12.44 కు
వర్జ్యం: మ. 12.29 - 1.59 కు
అమృతకాలం: రా. 9.27 - 10.56 కు
సూర్యోదయం: ఉ. 6.00 కు
సూర్యాస్తమయం: సా. 6.38 కు
గురుబోధ: మానవులు కష్టం వచ్చినప్పుడు మన వెంట ఎవరూ లేరని మనమొక్కరమే ఉన్నామని కృంగిపోకూడదు. సర్వకాల సర్వావస్థలలో మన వెంట నిలబడేది పరమాత్మ ఒక్కడే. కష్టం రావడం అన్నది దేహం యొక్క లక్షణం కాబట్టి తాత్కాలికమైన కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము. దేహధారి స్వతంత్రుడు కాదు, అన్ని సమయాలలో ఒకే విధంగా నడవడం అన్నది కుదరదు కనుక పగలు రాత్రి వలె, సుఖము పగలుగా దుఃఖము రాత్రిగా వస్తూ, పోతూ ఉంటాయి. ఈ నిజాన్ని దిగమింగుకొని ఆత్మబలంతో ముందుకు సాగుతూ ఉండాలి. పరమాత్మపై పూర్తి భక్తి విశ్వాసాలతో దుఃఖము అనే భ్రమ నుంచి వైదొలగడమే జ్ఞానము. ఈ సత్యాన్ని మనం ఆకళింపు చేసుకొని నిత్యజీవితంలో ఆచరణలో ఉంచాలి. వేదన కలిగినప్పుడు తొందరగా దాని నుంచి తేరుకొని ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ధర్మబద్ధంగా నడుచుకుంటూ ముందుకు సాగాలి, ఇదే పురాణాలు మనకందించే అద్భుత సందేశము, మనము అలవర్చుకోవలసిన జీవనశైలి.