Aug 21 2023ఆగస్టు 21 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 21 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము

తిథి : పంచమి రా. 09గం౹౹47ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : చిత్త 22వ తేదీ తె. 03గం౹౹44ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం : శుభ రా. 10గం౹౹21ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం :  బవ మ. 01గం౹౹14ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹19ని౹౹ వరకు & మ. 03గం౹౹00ని౹౹ నుండి 03గం౹౹50ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 10గం౹౹45ని౹౹ నుండి 12గం౹౹27ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹46ని౹౹ నుండి 10గం౹౹27ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹46ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹21ని౹౹కు

🕉️శ్రావణశుక్ల పంచమి, గరుడ పంచమి/నాగపంచమి, శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారి జన్మతిథి, పరమహంస పరివ్రాజకాచర్య శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద స్వరస్వతీ స్వామి వారి జన్మతిథి🕉️

గురుబోధ 
నాగదేవతా మూర్తులు లేదా ఏ ఇతర విగ్రహ మూర్తులకు అయినా పాలతో అభిషేకం చేసిన తర్వాత తప్పక నీటితో శుభ్రంగా అభిషేకం చేయాలి. 



👆ఈ ద్వాదశ నామమంత్రములను లేదా స్తోత్రమును పూజాసమయంలో లేదా నిద్రకు ముందు పఠిస్తే నాగభీతి ఉండదు. రోజుకు 3 సార్లు పఠిస్తే నాగదోషాలు నశిస్తాయి. వంశం లో చేసిన భయంకర నాగాపచారాలు కూడా తొలగిపోతాయి. పారాయణము చేసేవారికి ఇన్ని గొప్ప శుభాలు నాగదేవతలు ప్రసాదిస్తున్నప్పుడు నిత్యం తలుచుకోకుండా ఉండలేము కదా.

expand_less