Aug 20 2024ఆగష్టు 20 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 20 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం

తిథి: పాడ్యమి రా. 10.38 కు తదుపరి విదియ
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ధనిష్ఠ ఉ. 7.55 కు తదుపరి శతభిషం
యోగం: అతిగండ రా. 08.55 కు తదుపరి సుకర్మ
కరణం: బాలవ ఉ. 10.15 కు తదుపరి కౌలవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.32 - 09.22 కు & రా. 11.11 - 11.57 కు
వర్జ్యం: మ. 2.41 - 4.12 కు
అమృతకాలం: రా. 11.43 - 1.13 కు
సూర్యోదయం: ఉ. 6.00 కు
సూర్యాస్తమయం: సా. 6.38 కు

🕉️ గాయత్రీ ప్రతిపత్🕉️

శ్రీ గాయత్రీహృదయం 👇🏻👇🏻
https://youtu.be/ULj9WTZ7K_Q?si=N9XpTO7t12FZcTz4

శ్రీ గాయత్రీ కవచం 👇🏻👇🏻
https://youtu.be/wN9lUkl88ho?si=0uFAsJxzl9bK7cmd

గురుబోధ
1) గాయత్రీమంత్రోపదేశం ఉన్నవారు యథాశక్తి అష్టోత్తరశతం లేదా సహస్రం జపం చెయ్యడం చాలా శ్రేష్ఠం.
2) శ్రీ గాయత్రీహృదయం అనే దివ్యస్తోత్రం గాయత్రీదేవి హృదయాన్ని మన వైపునకు త్రిప్పే స్తోత్రం. ఈ స్తోత్రం వలన ఏ పూట పాపం ఆ పూటే పోతుంది, ఏ రాత్రి పాపం అప్పుడే తొలగిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. తినకూడని పదార్థాలు తింటే వచ్చే పాపాలు తొలగిస్తుంది. అతి భయంకర మహాపాపాలు తక్షణం తొలగిపోతాయి.
3) శ్రీ గాయత్రీకవచం పారాయణ వలన, వేయి గోవులు దానం చెయ్యటం వల్ల వచ్చే మహాఫలితం వస్తుంది. ఏ కష్టాలూ ఉండవు. నిత్యం భక్తి, శ్రద్ధలతో చదవడం వలన సంధ్యావందనం వంటి కార్యక్రమాలు చెయ్యని మహాపాపాల నుండి కూడా విముక్తులౌతారు. తదనంతరం సంధ్యావందనాది కార్యక్రామాలు చేసుకోవచ్చు.
శ్రీ మద్దేవీభాగవతంలో శ్రీమన్నారాయణుడు నారదుడిని శిష్యుడిగా చేసుకుని మనకి అందించినవి ఈ రెండు అపూర్వ స్తోత్రాలు.
expand_less