" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్టు 20 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము
తిథి : చతుర్థి రా. 08గం౹౹55ని౹౹ వరకు తదుపరి పంచమివారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : హస్త రా. 02గం౹౹17ని౹౹ వరకు తదుపరి చిత్తయోగం : సాధ్య రా. 09గం౹౹59ని౹౹ వరకు తదుపరి శుభకరణం : వణిజ ఉ. 11గం౹౹23ని౹౹ వరకు తదుపరి విష్టిరాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹41ని౹౹ నుండి 05గం౹౹32ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 09గం౹౹26ని౹౹ నుండి 11గం౹౹09ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹48ని౹౹ నుండి 09గం౹౹31ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹46ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹21ని౹౹కు
🕉️శ్రావణ శుక్ల చతుర్థి🕉️
గురుబోధ
గన్నేరు, అత్తిపువ్వులు, తెల్లమల్లెలు, ఎఱ్ఱపూలు, గరిక, తామరపూలతో అర్చిస్తే శ్రీ గణేశుడికి ప్రీతి. ప్రయాణానికి బయలుదేరు ముందు గణేశుడి షోడశనామాలు తలచుకోవాలి.
శ్రావణమాసం శుక్లపక్షంలో మధ్యాహ్నం వరకు చతుర్థి ఉంటే ఆ రోజున గణపతిని గరికతో పూజించాలి. ఈ వ్రతాన్ని దూర్వాగణపతి వ్రతం అంటారు. ఆలయంలో అయితే విగ్రహాలను, ఇంట్లో అయితే హరిద్రా గణపతిని, లేదా ఆర్క గణపతిని, లేదా శిలా విగ్రహములను పూజించాలి. ఈ వ్రతం అత్యంత శుభప్రదం.