కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 19 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: సప్తమి రా.8.27 కు తదుపరి అష్టమి 20 రా.9.50 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: స్వాతి ఉ.9.10 కు తదుపరి విశాఖ 20 ఉ.11.02 కు
యోగం: బ్రహ్మ రా. 3:43 కు తదుపరి ఐంద్ర 21 తె.4:24 కు
కరణం: గరిజ ఉ.6:31 కు, వణిజ రా.7:20 కు తదుపరి విష్టి 20 ఉ. 08:16 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.54 - 12.44 కు
వర్జ్యం: మ. 3.12 - 4.55 కు
అమృతకాలం: రా. 11.27 - 01.13 కు
సూర్యోదయం: ఉ. 6.03 కు
సూర్యాస్తమయం: సా. 6.35 కు
🕉️ తులసీదాసు జయంతి 🕉️
గురుబోధ:
🌺తులసీదాసు గారి చరిత్రలో చెప్పబడిన ప్రకారం యమునా నదీ తీరాన రామాపురంలో 1462లో ఒక విప్రవంశంలో తులసీదాస్ గారు మూలా నక్షత్రంలో జన్మించారు. తల్లిదండ్రుల మరణానంతరం చెత్తలో పడవేయడంతో 3 రోజులు పాలు లేకపోయినా జీవించి ఉన్నారు. ఒక సన్యాసి రాముడికి నైవేద్యం పెట్టిన పాలను పోసి పెంచారు.
🌺కాల ప్రభావం వలన భార్య మాటలు తులసీదాసు మనసును మార్చగా, రామనామం జపిస్తూ రాముడి కోసం ఈ ప్రాణం అంకితం అని కాశీకి చేరారు. నిత్యం రామాయణం పారాయణ చేస్తూ అక్కడికి వచ్చిన ప్రజలకు ప్రవచన రూపంలో రామాయణాన్ని చెపుతూ ఉండేవారు.
🌺హనుమంతుడిని గురువుగా పొందడం వల్ల తులసీదాసుగారికి, సీతారాముల దర్శనభాగ్యం కలిగింది. హనుమాన్ చాలీసాలో ముందుగా గురుమహిమ తెలియజేస్తూ వ్రాసిన "శ్రీగురుచరణసరోజరజ నిజమన ముకుర సుధారి" అన్న దోహా ప్రకారం గురుచరణములనే పద్మముల నుండి వచ్చే పుప్పొడితో (గురుపాదపద్మధూళితో) మనసు అనే అద్దంలో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనల మకిలిని తొలగించుకోవడం వల్లే రామచరితమానస్ ను వ్రాసే ఫలాన్ని హనుమంతుడు ప్రసాదించాడని, బుద్ధిహీనమైన ఈ శరీరాన్ని శుద్ధి చేసి, బలం, బుద్ధి, విద్యలు ఇచ్చి క్లేశమును తొలగించమని హనుమంతుడనే గురువును, తులసీదాసుగారు కోరారు. ఆ విధంగా రామదర్శనాన్ని పొంది తరించారు.
🌺హనుమాన్ చాలీసా ఒకే రోజులో 100 సార్లు పారాయణ చేస్తే జైల్లో ఉన్నవాళ్లు కూడా విడుదలవుతారు.
🌺లోకానికి మహిమాన్వితమైన భక్తిమార్గ వైశిష్ట్యాన్ని ఋజువు చేసి, తరించే మార్గాన్ని ఆచరించి చూపిన తులసీదాసుగారి జీవితం మహోన్నతమైంది.
https://youtu.be/1cNnFd4ecjA?si=S-tYhBZGfTRx4DZ_
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial