Aug 19 2025ఆగష్టు 19 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 19 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం

తిథి: ఏకాదశి సా.6.13 కు తదుపరి ద్వాదశి 20 సా.4.07 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఆరుద్ర రా.2.54 కు తదుపరి పునర్వసు 20 రా.1.38 కు
యోగం: వజ్ర రా.8:29 కు తదుపరి సిద్ధ 20 సా.6:13 కు
కరణం: బాలవ ఉ.8.22 కు తదుపరి కౌలవ తె.2.43 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:34-9:24 కు, మ. 11:11-11:56 కు
వర్జ్యం: ఉ.11.50-1.21 కు
అమృతకాలం: మ.03:31-05:04 కు
సూర్యోదయం: మ. 3:33 కు
సూర్యాస్తమయం: సా. 6:28 కు

🕉️ శ్రావణ మాసం కృష్ణపక్ష ఏకాదశి(కామిక ఏకాదశి) 🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చేయాలి.

గురుబోధ:
🕉️విష్ణువును భక్తితో, అష్టోత్తరశతనామములతో కానీ, విష్ణుసహస్రనామముతో కానీ పూజించాలి.
🕉️కలియుగములో కటిక ఉపవాసము నిషిద్ధము కనుక శరీరము నిలబడుటకు కావలసిన రీతిలో పండుకానీ, పాలు కానీ, అల్పాహారం తీసుకుని ఉపవాసం చేయండి.
🕉️కామిక ఏకాదశి నాడు యథాశక్తి తప్పక భాగవతమును పారాయణ చేయండి. అలా చేసిన వారికి తప్పకుండా ఇహము, పరము రెండూ లాభిస్తాయి.
🕉️మరునాడు ద్వాదశి ఘడియలలో స్నానానంతరము యథాశక్తి దానధర్మాలు చేసుకుని భోజనం చేయాలి. అనుకున్న కోరికలను తీర్చి, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దివ్య తిథి ఈ కామిక ఏకాదశి. ఈ ఉపవాస వ్రతము చేసే వాళ్ళు అన్నదానము చేస్తే మరింత ఫలితం వస్తుంది.

expand_less