కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 17 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: త్రయోదశి 18 తె. 4.04 కు తదుపరి చతుర్దశి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ. 10.21 కు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: ప్రీతి ఉ. 10.48 కు తదుపరి ఆయుష్మాన్
కరణం: బాలవ ఉ. 08.05 కు తదుపరి కౌలవ
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 06.00 - 07.41 కు
వర్జ్యం: రా. 6.12 - 7.46 కు
అమృతకాలం: ఉ. 7.10 కు
సూర్యోదయం: ఉ. 6.00 కు
సూర్యాస్తమయం: సా. 6.40 కు
👉🕉️ శనిత్రయోదశి, సింహసంక్రమణం, శనిప్రదోషం 🕉️👈
గురుబోధ:
శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని జరుగుతున్న వారికి దోష ఉపశమనం. తెల్లవారుజామున 4.44 నుండి 10.44 వరకు సింహసంక్రమణపుణ్యకాలం.
శని స్తోత్రం పిప్పలాద ప్రోక్తం👇
https://youtu.be/97Q4_4k_hH4?si=54rRaEOlttF4jmx4
సూర్యపుత్రుడు శనైశ్చరుడు మహానుభావుడు. ఈయనకి సూర్యుడు, శివుడు, బ్రహ్మ, విష్ణువు ఎన్నో వరాలిచ్చారు.
o జన్మలగ్నంలో శని ఉన్నవారు లేదా జన్మలగ్నం నుండి రెండవ స్థానములో శని ఉన్నవారు, అష్టమశని (ఎనిమిదో స్థానంలో శని) ఉన్నవారు, అర్ధాష్టమశని, ఏలినాటిశని ఉన్నవారు 40 రోజులు, రెండు పూటలా ఈ స్తోత్రం చేస్తే శనిప్రభావం తగ్గుతుంది. తీవ్రమైన కష్టనష్టాలు రావు. శుభం జరుగుతుంది.
o సుప్రభాత సమయంలో శుచిగా, పవిత్రంగా శనైశ్చర స్తోత్రము చేయాలి. ఇలా చేస్తే మహాఫలితం వస్తుంది.
o శనివారం నువ్వులనూనె శరీరమంతా రాసుకుని స్నానం చేస్తే అష్టమశని ప్రభావం శాశ్వతంగా తొలగిపోతుంది.
o శనివారంనాడు నువ్వులనూనెతో శనైశ్చర విగ్రహాన్ని అభిషేకించి, ఆ తైలం కొంచెం కొద్దిగా తీసుకొని, కన్నులు మూసుకొని మన కనురెప్పలపై లేపనంగా రాసుకుంటే నేత్రసంబంధిత పీడలు తొలగిపోతాయి.
o నువ్వులు, నువ్వులనూనె దానం పుచ్చుకున్నవారు ఈ శనైశ్చర స్తోత్రము చదివి, గాయత్రీ మంత్రజపం (పది/ నూరు/సహస్ర) చేసుకుంటే, వారికి దానములు పుచ్చుకోవడం వల్ల వచ్చే నష్టములు ఉండవు. వారికి గ్రహదోషాలూ ఉండవు, వారు మహాత్ములు అవుతారు.
o పర్వకాలాలలో అనగా సంక్రాంతి, చతుర్దశి, అష్టమి అనే ప్రత్యేక కాలాలలో ఈ స్తోత్రం చేస్తే కురుక్షేత్రంలో గ్రహణస్నానానంతరం కోటిబారువుల బంగారం దానం చేసినంత ఫలితం కలుగుతుంది. కురుక్షేత్రంలో స్నానం గొప్పది, గ్రహణస్నానం మరింత గొప్పది, గ్రహణస్నానానంతరం సువర్ణదానం చాలా గొప్పది. ప్రభాసక్షేత్రంలో, కురుక్షేత్రంలో దానం చేయలేనివారు ఈ స్తోత్రంతో ఆ ఫలితం పొందవచ్చు.
శ్రీ మహావిష్ణు వేదస్తుతి (గాలవ ముని కృతం) 👇
https://youtu.be/UwFKCtE_fRU?si=zFjkIYvqftk0H1Vd
ఇందులో చతుర్వేదములు, ఉపనిషత్తుల యొక్క సారం నిక్షిప్తమై ఉన్నది. అందుకే ఇది వేదస్తుతి. ఇది విన్నా కూడా మనమే స్వయంగా స్తుతించిన, రచించిన ఫలితం పొందుతాము. వీలున్నప్పుడల్లా ఇది విన్నా, ముఖ్యంగా అమావాస్యలలో, సంక్రాంతి పర్వదినాలలో, గ్రహణాలలో, నదీస్నానాలలో ఈ స్తోత్రం వింటే తిరుగులేనటువంటి శక్తి పొందుతాము. శ్రీ మహావిష్ణువు ఈ స్తోత్రం విన్నవారిని రక్షించే బాధ్యత తనదేనని, రక్షణకై తన సుదర్శన చక్రమే పంపుతానని అన్నాడు. ఇది హరిరక్షణ పొందించే అద్భుత స్తోత్రం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం పొందే కష్టాల నుండి బయటపడవేసే అపూర్వ స్తోత్రం.