Aug 16 2023ఆగస్టు 16 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 16 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : అమావాస్య మ. 01గం౹౹48ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : ఆశ్లేష సా. 04గం౹౹54ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం : వరీయాన్ సా. 06గం౹౹31ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం :  నాగ మ. 03గం౹౹07ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹39ని౹౹ నుండి 12గం౹౹30ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹47ని౹౹ నుండి 06గం౹౹17ని౹౹ వరకు
అమృతకాలం : మ. 03గం౹౹07ని౹౹ నుండి 04గం౹౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹46ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹23ని౹౹కు

🕉️అమావాస్య🕉️

గురుబోధ 
ఎప్పుడూ అమావాస్యనాడు తలంటి మాత్రం పోసుకోకూడదు. ఈ పూట అభ్యంగనం పనికిరాదు. కేవలం శిరస్నానం చేస్తే చాలు. స్నానం చేసిన తరువాత ఒక పెద్ద రాగి గిన్నె కానీ, ఇత్తడి గిన్నె కానీ, కంచు గిన్నె కానీ లేదా మట్టి మూకుడు కానీ పెట్టుకుని అందులో నిండా నీళ్లు తీసుకోండి, ఆ నీటిలో ఎర్రని పూలు, నల్లని పూలు, పసుపుపచ్చ పూలు వేయండి. ఈ పువ్వులు, నీళ్లు కలిపి రెండు చేతులలో (దోసిలి) తీసుకొని మీ పితృదేవతలకు మూడు సార్లు వాళ్లను మనసారా తలుచుకొని అర్ఘ్యం విడిచిపెట్టండి (నీళ్లు విడిచిపెట్టేయండి). ఏదైనా వేరే పాత్రలో ఆ నీళ్లు పోసేయ్యండి. ఇక్కడ అమ్మకి నాన్నకి కాదు మీరు విడిచిపెట్టేది, మీ వంశాన్ని బాగు చేస్తున్న మహానుభావులైన పితృదేవతలకు, కాబట్టి అందరం ఆడ, మగ అనే తేడా లేకుండా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఈ తర్పణములు మాత్రం విడిచిపెట్టాలి. పిండప్రదానాలు మాత్రం తల్లిదండ్రులు ఉన్న వాళ్లు చెయ్యకూడదు తప్ప తర్పణములు అందరూ ఇవ్వాలి. ఈ విధముగా అమావాస్య తర్పణములు విడిచిపెట్టాక యథాశక్తిగా ఇష్టదేవతలను పూజించండి. సూర్యుడిని మాత్రం తప్పక పూజించండి. వీలుంటే నవగ్రహాలను తలచుకోండి, నవగ్రహాలకు ప్రదక్షణ చేయండి, నవగ్రహాలకు పూజ చేయండి. 
పూర్ణిమ, అమావాస్య  మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.


expand_less