Aug 15 2024ఆగష్టు 15 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 15 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: దశమి ఉ. 6.04 కు తదుపరి ఏకాదశి 16 తె 5.56 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: జ్యేష్ఠ ఉ. 9.54 కు తదుపరి మూల
యోగం: వైధృతి మ. 02.59 కు తదుపరి విష్కంభ
కరణం: గరజి ఉ. 10.26 కు తదుపరి వణిజ
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.13 - 11.04 కు & మ. 03.18 - 04.09 కు
వర్జ్యం: సా. 6.03-7.40 కు
అమృతకాలం: తె. 3.50 - 5.27 కు
సూర్యోదయం: ఉ. 5.59 కు
సూర్యాస్తమయం: సా. 6.42 కు

👉🕉️ శ్రావణశుక్ల ఏకాదశి, పుత్రద ఏకాదశి, అరవిందయోగి జయంతి 🕉️👈

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ చేయాలి.

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX

గురుబోధ:
శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. కలియుగంలో పుత్రులు కావాలనుకున్నవారు ఆచరించవలసినటువంటి ఏకాదశి ఈ పుత్రద ఏకాదశి.
ఈ రోజు పాటించవలసిన విధివిధానాలు👇
🕉️ వీలున్నంత వరకు ఈరోజు నారాయణ స్మరణ చేయాలి. అష్టాక్షరీ మంత్రోపదేశం ఉన్నవాళ్లు ఆ మంత్రాన్ని జపించాలి. వీలుంటే విష్ణు సంకీర్తన చేయాలి.
🕉️ కలియుగంలో వివిధ కారణాల వలన పూర్తిగా ఉపవాసం ఉండలేము కనుక ఒక పండు, పాలు లేదా స్వల్ప ఆహారం తీసుకుని ఉపవాసం ఉండాలి. అన్నం మాత్రం తినకూడదు.
🕉️ఈ వ్రతం చేసి మర్నాడు ద్వాదశినాడు ఉదయాన్నే లేచి తిరిగి విఘ్ణవుని అర్చించి ద్వాదశి ఘడియలు దాటక ముందే పారణ పూర్తి చేయాలి. శక్తి కొలది దానాలు చేయడం మంచిది.
🕉️ ఏకాదశి నాడు గోవులకు ప్రదక్షిణ చేసి గోవులకు గడ్డి పెట్టాలి, గోపూజ చేయాలి.

expand_less