" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్టు 15 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము
తిథి : చతుర్దశి ఉ. 11గం౹౹53ని౹౹ వరకు తదుపరి అమావాస్యవారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : పుష్యమి మ. 02గం౹౹22ని౹౹ వరకు తదుపరి ఆశ్లేషయోగం : వ్యతీపాత సా. 05గం౹౹33ని౹౹ వరకు తదుపరి వరీయాన్కరణం : శకుని మ. 12గం౹౹42ని౹౹ వరకు తదుపరి చతుష్పాదరాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & రా. 10గం౹౹55ని౹౹ నుండి 11గం౹౹40ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹31ని౹౹ నుండి 06గం౹౹01ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 07గం౹౹21ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹46ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹23ని౹౹కు
🕉️కృష్ణ చతుర్దశి, భౌమ చతుర్దశి, కృష్ణ అంగారక చతుర్దశి, అమాపుష్య యోగము, పద్మక యోగము, వ్యతీపాత యోగము🕉️గురుబోధ
మానవులై పుట్టాక ఏదో ఒక ఋణం మనలను పట్టి పీడిస్తూ ఉంటుంది. ఋణ సంబంధమైన విముక్తి అంత తేలిక కాదు. అందునా ధనసంబంధమైన ఋణాలు మానవులని బాగా పట్టి పీడిస్తుంటాయి. ఇతరులు మనకు అప్పు ఉండి ఆ అప్పు తీర్చకపోయినా, మనం ఇతరులకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వలేకపోయినా ఈ రెండు రకాల ఋణాల నుండి విముక్తి పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ కుజస్తోత్రమును పారాయణం చేయమని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు కుమారస్వామికి చెప్పాడు. అందువలన ఈ స్తోత్రాన్ని తప్పక భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నా, విన్నా సకల ఋణాలూ తొలగిపోతాయి. అందునా మంగళవారమునాడు ఈ దివ్యస్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా లేక విన్నా, తక్షణం ఋణవిముక్తి అవుతుంది.