Aug 14 2023ఆగస్టు 14. 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 14 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : త్రయోదశి ఉ. 10గం౹౹13ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : పునర్వసు మ. 12గం౹౹04ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : సిద్ధి సా. 04గం౹౹40ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం :  వణిజ ఉ. 10గం౹౹25ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹31ని౹౹ నుండి 01గం౹౹21ని౹౹ వరకు & మ. 03గం౹౹03ని౹౹ నుండి 03గం౹౹54ని౹౹ వరకు
వర్జ్యం : రా. 08గం౹౹49ని౹౹ నుండి 10గం౹౹34ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 09గం౹౹28ని౹౹ నుండి 11గం౹౹11ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹45ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹24ని౹౹కు

గురుబోధ 
ఈ చరాచర జగత్తంతా దైవాధీనం. మన అధీనంలో ఉన్నదేదీ లేదు. కాబట్టి బుద్ధిమంతుడు శోకంతో తన ఆత్మను శోషింపచేసుకోకూడదు అనగా అనవసరంగా దుఃఖించి మనశ్శాంతికి దూరం కాకూడదు. కొయ్యబొమ్మను నటుడు ఆడించినట్లుగా మన కర్మ మనలను ఆడిస్తుంది. మనం చక్కని సద్బుద్ధితో, సత్కర్మలు చేస్తూ ఉండాలంటే, మన బుద్ధిని సరి అయిన మార్గంలో నడిపించేందుకు అమ్మవారి పాదపద్మాలను పట్టుకోవాలి. శ్రీ మద్దేవీభాగవతం ప్రారంభశ్లోకమైన సర్వగాయత్రిని నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి.
సర్వ చైతన్య రూపాం తాం
ఆద్యాం విద్యాం చ ధీమహి
బుద్ధిం యా నః ప్రచోదయాత్ |

expand_less