Aug 13 2024ఆగష్టు 13 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 13 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: నవమి 14 తె. 5.35 కు తదుపరి దశమి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: విశాఖ ఉ. 7.30 కు తదుపరి అనూరాధ
యోగం: బ్రహ్మ సా. 04.34 కు తదుపరి ఐంద్ర
కరణం: బవ ఉ. 08.31 కు తదుపరి బాలవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.32 - 09.23 కు & రా. 11.13 - 11.58 కు
వర్జ్యం: ఉ. 11.44 - 1.26 కు
అమృతకాలం: రా. 9.54 - 11.39 కు
సూర్యోదయం: ఉ. 5.59 కు
సూర్యాస్తమయం: సా. 6.43 కు

👉🕉️శ్రావణ మంగళగౌరీ వ్రతం🕉️👈

గురుబోధ:
🕉️ఇల్లు శుభ్రంగా ఉంచుకోకపోతే లక్ష్మీ దేవి ఆ ఇంటిలో ఉండదు.
🕉️ఒకసారి కట్టి విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ కట్టరాదు. అలా కడితే లక్ష్మీదేవి వారిని విడిచిపెడుతుంది.
🕉️అగస్త్యుడు లోపాముద్రాసమేతంగా కరవీరపురం (కోలాపురం/కొల్హాపురం) చేరి మంగళదేవత, మంగళస్వరూపిణి, విష్ణువు యొక్క హృదయపద్మంలో ఉంటూ తెల్లని, బంగారురంగుతో ఉండే శ్రీమహాలక్ష్మిని చేసిన గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులైనా ఐశ్వర్యవంతులవుతారు. ఒక 40 రోజులు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా వారి ఇంట్లో నేను కొలువై ఉంటాను అని శ్రీ మహలక్ష్మీదేవి వరమిచ్చింది.

https://srivaddipartipadmakar.org/stotram/agastyakruta-sri-mahalakshmi-stotram-kasikhandamskaaandapuranam/
expand_less