Aug 12 2023ఆగస్టు 12 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 12 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : ఏకాదశి ఉ. 08గం౹౹04ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : మృగశిర ఉ. 08గం౹౹35ని౹౹ వరకు తదుపరి ఆర్ద్ర
యోగం : హర్షణ మ. 03గం౹౹23ని౹౹ వరకు తదుపరి వజ్ర
కరణం :  బాలవ సా. 06గం౹౹31ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹55ని౹౹ నుండి 07గం౹౹25ని౹౹ వరకు
వర్జ్యం : సా. 05గం౹౹31ని౹౹ నుండి 07గం౹౹13ని౹౹ వరకు
అమృతకాలం : రా. 10గం౹౹29ని౹౹ నుండి 12గం౹౹11ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹45ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹25ని౹౹కు

🕉️ఏకాదశి🕉️
ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ ఈరోజు ఉదయం 08గం౹౹04ని౹౹ తరువాత చేయాలి.

గురుబోధ 
నవగ్రహ దేవతలు కాశీలో గొప్ప తపస్సు చేసి తమపేరు మీద లింగాన్ని ప్రతిష్ఠించి గ్రహాధిపత్యం పొందారు. మన పూర్వజన్మ పుణ్యపాప కర్మలను అనుసరించి మాత్రమే తగిన శుభ లేదా అశుభ ఫలితాలని ఇస్తారు. వారిని నిత్యం స్మరించడం, ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పక  ప్రదక్షిణ, నమస్కారాలు చేసాక మాత్రమే ప్రధాన దేవతామూర్తిని దర్శించాలని శాస్త్రం చెపుతున్నది. నవగ్రహ ప్రదక్షిణ, పూజ అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చును. కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు.

expand_less