కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 11 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ మ.1.24 కు తదుపరి తదియ 12 ఉ.11.49 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: శతభిషం మ.2.58 కు తదుపరి పూర్వాభాద్ర 12 మ.2.13 కు
యోగం: అతిగండ రా.8:33 కు తదుపరి సుకర్మ 12 సా.6:53 కు
కరణం: గరజి ఉ.10.34 కు తదుపరి వణిజ రా.11.08 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:46-1:37 కు, మ. 3:18-4:08 కు
వర్జ్యం: రా.9.13-10.46 కు
అమృతకాలం: ఉ.06:04-07:36 కు
సూర్యోదయం: ఉ. 5:44 కు
సూర్యాస్తమయం: సా. 6:28 కు
🕉️ పూజ్యశ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామివారి ఆరాధన 🕉️
గురుబోధ:
బలవంతమైన ఇంద్రియాలు మనస్సును రకరకాల భ్రమలకు గురి చేసి జీవులను మోహితులను చేసి అనేక జన్మలు ఎత్తేలా చేస్తుంటాయి. రకరకాల ప్రవర్తనలకు గుణాలే కారణం. తన పనిని పూర్తి చేసుకోవాలని భావించే మనిషి ముందుగా అసత్యం ఆడడం మొదలుపెడతాడు. క్రమంగా విషయలాలసుడు అవుతాడు అనగా ఇంద్రియసుఖాలకు బానిసవుతాడు. ఒకవేళ సుఖాలు దక్కకపోతే మోసాలు చేయడం మొదలుపెడతాడు. మోసాలు చేయడంతో ఘోరపాపాలు మూటకట్టుకుంటాడు. అందుకే ఏదో ఒక భగవత్ సాధన చేసి దేవతానుగ్రహం పొందాలి. సాధనలో పురాణశ్రవణం, మంత్రజపం, నామజపం, భజన, భగవత్ పూజ, పారాయణం లేదా భగవత్ సేవ మొ౹౹ ఉత్తమమైనవి. - శ్రీ మద్ధేవీభాగవతము.