Aug 11 2024ఆగష్టు 11 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 11 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి 12 తె. 3.26 కు తదుపరి అష్టమి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: స్వాతి 12 తె. 5.33 కు తదుపరి విశాఖ
యోగం: శుభ మ. 03.49 కు తదుపరి శుక్ల
కరణం: గరజి సా. 06.53 కు తదుపరి వణిజ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 05.02 - 05.53 కు
వర్జ్యం: ఉ. 9.24 - 11.09 కు
అమృతకాలం: రా. 7.59 - 9.44 కు
సూర్యోదయం: ఉ. 5.58 కు
సూర్యాస్తమయం: సా. 6.44 కు

గురుబోధ:
ఆదివారం మరియు సప్తమీ తిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండు కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది.
శ్రావణశుక్ల సప్తమిని అవ్యంగవ్రతం అంటారు. శ్రీమహావిష్ణువును యథావిధిగా పూజించి, నాలుగు దోసిళ్ళ ప్రత్తిని ఆయన పాదాల దగ్గర ఇత్తడి పళ్ళెంలో ఉంచి, దానిని విప్రునకు దానం ఇచ్చే విధానాన్ని అవ్యంగవ్రతం అంటారు. ఇది అత్యంత శుభప్రదం.

expand_less