Aug 11 2023ఆగస్టు 11 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 11 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : దశమి ఉ. 07గం౹౹44ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : రోహిణి ఉ. 07గం౹౹34ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం : వ్యాఘాత మ. 03గం౹౹06ని౹౹ వరకు తదుపరి హర్షణ
కరణం :  బవ సా. 05గం౹౹45ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & మ. 12గం౹౹31ని౹౹ నుండి 01గం౹౹22ని౹౹ వరకు
వర్జ్యం : మ. 01గం౹౹24ని౹౹ నుండి 03గం౹౹04ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹25ని౹౹ నుండి 05గం౹౹55ని౹౹ వరకు & రా. 11గం౹౹24ని౹౹ నుండి 01గం౹౹04ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹45ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹26ని౹౹కు

🕉️ఏకాదశి🕉️
ఏకాదశి ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ రేపు ఉదయం చేయాలి.

గురుబోధ 
ఏకాదశి సూర్యోదయానికి శనివారం అనగా ఆగస్టు 12వ తేదీ ఉన్నప్పటికీ వేదవ్యాసమహర్షి విరచిత శ్రీ స్కాందపురాణాంతర్గతంగా ఎక్కువభాగం ఏకాదశి ఉన్నప్పుడు, ఏకాదశీవ్రతం ఆచరించడం మంచిది. ఏకాదశి విష్ణుస్వరూపము. పరమపవిత్రమైన ఏకాదశీ ఘడియలలో లక్ష్మీనారాయణులను యథాశక్తి అర్చిస్తూ, విష్ణుస్తోత్రాలను విన్నా, పారాయణం చేసినా సకలశుభఫలితాలు పొందుతాము.

https://youtu.be/UwFKCtE_fRU

expand_less