కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 10 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: ద్వాదశి ఉ.6.21 కు, త్రయోదశి 11 తె.3.59 కు తదుపరి చతుర్దశి 11 రా.1.42 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఆర్ద్ర మ.12.01 కు తదుపరి పునర్వసు 11 ఉ.10.26 కు
యోగం: వజ్ర రా.10:26 కు తదుపరి వ్యతీపాత 11మ.3:25 కు
కరణం: గరజి సా.6:27 కు తదుపరి విష్టి 11 మ.3:23 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.46 - 1.37 కు, మ. 3.18 - 4.09 కు
వర్జ్యం: రా.11.13 - 12.43 కు
అమృతకాలం: తె. 03.23 - 04.50 కు
సూర్యోదయం: ఉ. 6.01 కు
సూర్యాస్తమయం: సా. 6.41 కు
🕉️ ప్రదోషం 🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ సోమవారం ఉదయం 6 గం.ల 15 ని.ల లోపు చేసేయాలి.
గురుబోధ:
🕉️ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీపరమేశ్వరుల ఐక్యరూపం.
🕉️చెట్లు, తీగలు మొదలైన వాటిని స్థావరలింగాలు అంటారు. వీటికి నీరు పోసి పోషిస్తే శివుని స్థావరలింగపూజగా శివుడు భావిస్తాడు. కాబట్టి శివభక్తులు వీటిని పోషించాలి. పక్షులు, జంతువులు జంగమాలు అనబడతాయి. వీటిని రక్షించి పోషిస్తే శివుని జంగమలింగపూజ అవుతుంది. కాబట్టి వీటిని కూడా పోషించి రక్షించాలి. ఈ మొత్తం పూజను ప్రకృతిపూజగా అనగా అమ్మవారి పూజగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇది నిజమైన శివపూజ. శివాలయం తుడిచినవాడు, కడిగి శుభ్రం చేసినవాడు, శివుడి కోసం పూలతోట పెంచి, అందులోని పూలను శివునకు అర్పించినవాడు శివపదం పొందుతాడు. బ్రతికినంతకాలం సంపదలు పొందుతాడు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial