కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 10 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: షష్ఠి రా. 1.46 కు తదుపరి సప్తమి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: చిత్త తె. 3.17 కు తదుపరి స్వాతి
యోగం: సాధ్య మ. 02.52 కు తదుపరి శుభ
కరణం: కౌలవ మ. 04.31 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 05.58 - 07.40 కు
వర్జ్యం: ఉ. 9.36 - 11.22 కు
అమృతకాలం: రా. 8.14 - 10.00 కు
సూర్యోదయం: ఉ. 5.58 కు
సూర్యాస్తమయం: సా. 6.45 కు
గురుబోధ:
పూర్వం ధర్మాత్ముడు అయిన మిత్రసహుడు (కల్మాషపాదుడు) అనే రాజు వేటకు వెళ్లి నర్మదానదము మరియు అక్కడ ఉన్న అమరకంఠకము అనే పర్వతవైశిష్ట్యం తెలియక వాటిని విమర్శించాడు. ఆ పాప కర్మ ఫలితంగా తరువాతి రోజులలో గురువుగారయిన వశిష్ఠుని శాపం పొంది కల్మాషపాదుడు అయ్యాడు. చివరికి రాక్షసుడై గంగా జల ప్రోక్షణ వల్ల శాపం నుండి విముక్తి పొందగలిగాడు. ఇన్ని కష్టాలకు కారణం కేవలం మహాత్ములను, క్షేత్రాలను, నదులను, గురువులను, నిందించడం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో విమర్శించరాదు. చిన్నచూపు చూడరాదు. - శ్రీ నారదమహాపురాణము