" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్టు 10 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము తిథి : నవమి ఉ. 07గం౹౹54ని౹౹ వరకు తదుపరి దశమి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : కృత్తిక ఉ. 07గం౹౹03ని౹౹ వరకు తదుపరి రోహిణి యోగం : ధృవ మ. 03గం౹౹11ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత కరణం : వణిజ మ. 04గం౹౹34ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹58ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు & మ. 03గం౹౹04ని౹౹ నుండి 03గం౹౹55ని౹౹ వరకు వర్జ్యం : రా. 11గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹01ని౹౹ వరకు అమృతకాలం : తె. 04గం౹౹17ని౹౹ నుండి 06గం౹౹14ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹44ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹26ని౹౹కు గురుబోధ నిత్యం ఏదో ఒక భగవన్నామము నిరంతరం స్మరించడం అలవాటు చేసుకోవాలి. ఉదా౹౹ రామభక్తులు ఎవరినైనా కలిసినప్పుడు "జై శ్రీరామ్ " అని సంబోధించి మాట్లాడుతారు. అలాగే "జై గురుదత్త , హరే కృష్ణ , రాధేకృష్ణ , పాండురంగ , జై గణేశ , శివశివ , శ్రీమాత ఇలా ఏదో ఒక ఇష్టమైన నామమును పట్టుకోవాలి. అదే మనల్ని రక్షిస్తుంది. తరింపచేస్తుంది