కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 09 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: ఏకాదశి ఉ.8.49 కు తదుపరి ద్వాదశి 10 ఉ.6.21 కు, త్రయోదశి 11 తె.3.59 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: మృగశిర మ.1.41 కు తదుపరి ఆర్ద్ర 10 మ.12.01 కు
యోగం: హర్షణ రా.2:04 కు తదుపరి వజ్ర 10 రా.10:26 కు
కరణం: బాలవ ఉ.11:05 కు తదుపరి గరజి 10 సా.6:27 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 5.00 - 5.51 కు
వర్జ్యం: రా.9.30 - 10.59 కు
అమృతకాలం: ఉ. 06.41 - 08.08 కు
సూర్యోదయం: ఉ. 6.01 కు
సూర్యాస్తమయం: సా. 6.41 కు
🕉️ ఆషాఢ బహుళ ఏకాదశి 🕉️
ఏకాదశీ ఉపవాసం ఆదివారం ఉండాలి. ద్వాదశీ పారణ సోమవారం ఉదయం 6 గం.ల 15 ని.ల లోపు చేసేయాలి.
గురుబోధ:
ఆషాఢ బహుళైకాదశి నాడు ఉపవాసం ఉండి, హరిపూజ చేసినవారికి అనేక శుభయోగాలు లభిస్తాయి. ఈ తిథినాడు చేసే ఉపవాసం వల్ల, శ్రీహరి పూజ వల్ల, సకల రోగాలు తొలగి, ఆనందమయ జీవితం లభిస్తుంది. నైమిశారణ్యంలో 88,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం ఈనాడు ఏకాదశీ ఉపవాసం ఉండి శ్రీహరి పూజ చేసినవారికి లభిస్తుంది.
శ్రీ వాసుదేవ స్తోత్రమ్ 👇
https://youtu.be/J658-6zYEPg?si=fyYvamTZNrukpoJ4
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial