" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్టు 09 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము తిథి : అష్టమి ఉ. 08గం౹౹36ని౹౹ వరకు తదుపరి నవమి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : భరణి ఉ. 07గం౹౹02ని౹౹ వరకు తదుపరి కృత్తిక యోగం : వృద్ధి మ. 03గం౹౹41ని౹౹ వరకు తదుపరి ధృవ కరణం : తైతుల మ. 03గం౹౹56ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹41ని౹౹ నుండి 12గం౹౹32ని౹౹ వరకు వర్జ్యం : రా. 07గం౹౹02ని౹౹ నుండి 08గం౹౹38ని౹౹ వరకు అమృతకాలం : తె. 04గం౹౹38ని౹౹ నుండి 05గం౹౹44ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹44ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹22ని౹౹కు గురుబోధ బలవంతమైన ఇంద్రియాలు మనస్సును రకరకాల భ్రమలకు గురి చేసి జీవులను మోహితులను చేసి అనేక జన్మలు ఎత్తేలా చేస్తుంటాయి. రకరకాల ప్రవర్తనలకు గుణాలే కారణం. తన పనిని పూర్తి చేసుకోవాలని భావించే మనిషి ముందుగా అసత్యం ఆడడం మొదలుపెడతాడు. క్రమంగా విషయలాలసుడు అవుతాడు అనగా ఇంద్రియసుఖాలకు బానిసవుతాడు. ఒకవేళ సుఖాలు దక్కకపోతే మోసాలు చేయడం మొదలుపెడతాడు. మోసాలు చేయడంతో ఘోరపాపాలు మూటకట్టుకుంటాడు. అందుకే ఏదో ఒక భగవత్ సాధన చేసి దేవతానుగ్రహం పొందాలి. సాధనలో పురాణశ్రవణం, మంత్రజపం, నామజపం, భజన, భగవత్ పూజ, పారాయణం లేదా భగవత్ సేవ మొ౹౹ ఉత్తమమైనవి. - శ్రీ మద్ధేవీభాగవతము. https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial